హాఫ్ సెంచరీ కొట్టిన ఊపిరి..!
on May 13, 2016
నాగార్జున, కార్తీల మల్టీ స్టారర్ ఊపిరి ఈరోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్రెంచి మూవీ ది ఇంటచిబుల్స్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అద్భుతమైన కథ, కథనం, ఆకట్టుకునే సన్నివేశాలు, సున్నితమైన హాస్యంతో ఊపిరి ప్రేక్షకుల మనసు దోచుకుంది. 50 రోజులు పూర్తైన సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఊపిరికి పనిచేసిన వారందరికీ ఆ సినిమా ఒక గౌరవాన్ని తీసుకొచ్చిందని ఆయన అన్నారు. పివీపీ సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించిన ఊపిరి నాగార్జునకు హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఆవారా కుర్రాడిగా కార్తీ కనిపిస్తే, కుర్చీకే పరిమితమైన కోటీశ్వరుడిగా నాగార్జున నటించారు. నాగార్జున ముందు సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమా కూడా 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.