ఆ హీరోయిన్ కు మహేష్ అవకాశమిస్తేనే పెళ్లి..!
on May 13, 2016
టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు దున్నేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడున్న కుర్రహీరోయిన్లలో రకుల్ టాప్ పొజీషన్లో ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోల సినిమాలు హిట్స్ అవడంతో, అమ్మడికి అవకాశాలు మరింత జోరందుకున్నాయి. కేవలం తెలుగే కాక, తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటున్న ఈ భామ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లలో ఎవరినైనా పెళ్లి గురించి అడిగితే, అబ్బే అప్పుడే పెళ్లేంటి..ఇప్పట్లో కాదు లెండి అని స్టాండర్డ్ ఆన్సరిస్తారు. అయితే రకుల్ మాత్రం, ఇంకా మహేష్ తో సినిమా చేయకుండా పెళ్లేంటి అని జవాబిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగులో సూపర్ స్టార్ డమ్ ఉన్న మహేష్ తో సినిమా చేయకుండా, పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని ఖచ్చితంగా చెప్పేస్తోందీ భామ. ప్రస్తుతానికి మహేష్ తెలుగు తమిళ భాషల్లో పేరున్న హీరోయిన్లను, బాలీవుడ్ వాళ్లను తీసుకుంటున్నాడు తప్ప ఇంకా యంగ్ హీరోయిన్ల వైపు చూడట్లేదు. మరి రకుల్ కు అవకాశం ఎప్పుడిస్తాడో చూడాలి.