సూసైడ్ బాంబర్ అనుకుని సత్యదేవ్ ని అరెస్ట్ చేసిన ఆఫ్ఘన్ పోలీసులు!
on Dec 11, 2022

హీరో సత్యదేవ్ ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. టాలీవుడ్, బాలీవుడ్ అని లేదు..ఆఫర్స్ ని అందిపుచ్చుకుంటూ ఏ గాడ్ ఫాదర్ కూడా లేకుండా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. అతను చేసే ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. మెసేజ్ ఓరియెంటెడ్ గా, ఇన్స్పిరేషనల్ గా, మోటివేషనల్ గా ఉంటాయి ఆయన చేసే మూవీస్. అలాంటి సత్యదేవ్ లైఫ్ లో అనుకోని ఒక సంఘటన జరిగిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఓ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన విషయమట అది. తనను ఒక సూసైడ్ బాంబర్ అనుకుని ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారట. సూసైడ్ బాంబర్స్ కాలి కింద ట్రిగ్గర్ పెట్టుకుని అవసరమైనప్పుడు ఆపరేట్ చేస్తారని తనకు అక్కడికి వెళ్లెవరకూ తెలీదట. ఎయిర్ పోర్టులో తన పక్కన కూర్చున్న వ్యక్తి తన కాలు కింద సాక్స్ లో పాస్ పోర్ట్ పెట్టుకుని దాన్ని తీసుకోబోతుండగా ఏదో బాంబు లాంటిది తీయబోతున్నాడనుకుని పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఆయన్ను, పక్కనున్న తనను అరెస్ట్ చేశారని చెప్పాడు. అయితే ఫిలిం యూనిట్ మొత్తం వచ్చి తాము షూటింగ్ కోసం వచ్చినట్లు చెప్పేసరికి పోలీసులు వదిలేశారని చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



