అఫీషియల్.. 'దేవర-2' షూటింగ్ కి ముహూర్తం ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే?
on Jan 27, 2026
.webp)
దేవర పార్ట్-2 పై నిర్మాత కీలక ప్రకటన
షూటింగ్ కి ముహూర్తం ఖరారు
విడుదల ఎప్పుడంటే..?
దేవర పార్ట్-2 ఉంటుందా లేదా? అనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. మెజారిటీ ఆడియన్స్ తో పాటు, కొందరు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ సైతం 'దేవర-2'(Devara 2) ఉండకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి సమయంలో మేకర్స్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.
'దేవర-2' ఖచ్చితంగా ఉంటుందని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పష్టం చేశారు. అంతేకాదు.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పారు.
తాజాగా జనగాంలో జరిగిన ఒక కార్యక్రమంలో మిక్కిలినేని సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు 'దేవర-2' ఉంటుందా లేదా? ఉంటే ఎప్పుడు? అనే ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది. దానికి బదులిస్తూ.. "దేవర-2 మే నుంచి మొదలవుతుంది. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుద్ది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది." అని సుధాకర్ చెప్పారు.
Also Read: మెగా కాంపౌండ్ లోకి 'క' దర్శకులు.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ సినిమా.. 2024 సెప్టెంబర్ 27న విడుదలైంది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది.
కంటెంట్ పరంగా 'దేవర' యావరేజ్ గానే ఉందని, ఎన్టీఆర్ స్టార్డమ్ తోనే ఇది హిట్ అయిందని.. అందుకే పార్ట్-2 ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా 'దేవర-2' ఉంటుందని గతంలో రెండు మూడు సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల మళ్ళీ ఎటువంటి సౌండ్ లేకపోవడంతో.. ఇక దేవర సీక్వెల్ లేనట్టే అనుకున్నారంతా. కానీ 'దేవర-2' ఉంటుందని, మే నెలలో స్టార్ట్ అవుతుందని చెప్పి తాజాగా సర్ ప్రైజ్ చేశారు ప్రొడ్యూసర్ సుధాకర్.
కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'(Dragon) సినిమా చేస్తున్నారు. పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. మరి మే నాటికి ఈ షూటింగ్ పూర్తి చేసి, 'దేవర-2'తో ఎన్టీఆర్ బిజీ అవుతారా?.. లేక రెండూ పారలల్ గా చేస్తారో చూడాలి. పైగా 'డ్రాగన్'కి కూడా పార్ట్-2 ఉందనే మాట వినిపిస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులతోనూ ఎన్టీఆర్ సినిమాలు కమిటై ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



