మెగా ఛాన్స్ కొట్టేసిన 'క' దర్శక ద్వయం.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ!
on Jan 27, 2026

మెగా కాంపౌండ్ లోకి 'క' దర్శకులు
మెగా హీరోతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' సినిమాతో దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకులుగా పరిచయమయ్యారు. రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. దర్శకులుగా సుజీత్, సందీప్ లకు ఎంతో పేరు తీసుకొచ్చింది. దీంతో వారి రెండో సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే వారికి మెగా కాంపౌండ్ లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (Sujith and Sandeep)
'క' దర్శక ద్వయంతో సినిమా చేయడానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రూ.90 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 'విరూపాక్ష'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సాయి తేజ్.. ఇప్పుడు తన మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' (Sambarla Yeti Gattu) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. రోహిత్ దర్శకత్వంలో దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్నారు.

'సంబరాల ఏటిగట్టు' తర్వాత కూడా మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు సాయి తేజ్. ఈ చిత్రానికి 'క' దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వం వహించనున్నారు. కొద్ది నెలలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. గతంలో సుజీత్, సందీప్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి డెవలప్ చేయమని చెప్పాడు సాయి తేజ్. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ ని విని.. సినిమా చేయడానికి సాయి తేజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



