మూడ్ అంతా అప్‌సెట్ చేశాడు.. బండ్ల గణేష్ కామెంట్స్‌పై బన్నీవాసు!
on Oct 10, 2025
ఇటీవలికాలంలో కాంట్రవర్సీ కామెంట్స్ బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా వినియోగం ఎక్కువ కావడంతో ఏ చిన్న కామెంట్ వినిపించినా దాన్ని వైరల్ చేసేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు క్షణాల్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోతున్నాయి. ఇదే అదనుగా కొందరు వివాదాస్పద వ్యక్తులు వీలున్నప్పుడల్లా ఎవరో ఒకరి మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. అతను ఏ వేదిక ఎక్కినా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చెయ్యకుండా కిందకు దిగడు. ఈవెంట్‌కి బండ్ల గణేష్ వచ్చాడంటే సోషల్ మీడియాకు చేతి నిండా పనే. అలాంటి ఓ ఎపిసోడ్ లిటిల్ హార్ట్స్ ఫంక్షన్‌లో జరిగింది. విజయ్ దేవరకొండ, మహేష్, అల్లు అరవింద్‌లను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్స్ చేశాడు.
లిటిల్ హార్ట్స్ హీరో మౌళికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెబుతూ, మరికొన్ని విషయాల్లో హెచ్చరిస్తూ గణేష్ స్పీచ్ కొనసాగింది. తన స్పీచ్ పూర్తయిన తర్వాత ఈవెంట్ నుంచి ఆయన వెళ్లిపోయాడు. ఆ తర్వాత బన్నీ వాసు మాట్లాడుతూ గణేశ్ చేసిన కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తావన వచ్చింది. దాని గురించి బన్నీ వాసు మాట్లాడుతూ ‘బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నన్నే కాదు, అందర్నీ షాక్‌కి గురి చేశాయి. అరవింద్‌గారు ఎన్నో సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఆయన గురించి కూడా అలా మాట్లాడడం బాధ అనిపించింది. ఎంతో హ్యాపీగా జరుగుతున్న ఆ ఫంక్షన్ అతని కామెంట్స్ వల్ల అందరి మూడ్ అప్‌సెట్ అయింది’ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



