కాళ్ళు విరగ్గొడతామన్నారు.. నిహారిక అంటే అంతే మరి
on Oct 10, 2025

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న 'నిహారిక ఎన్ ఎం'(Niharika Nm)ఈ నెల 16 న విడుదల కాబోతున్న 'మిత్ర మండలి'(Mithra Mandali)అనే మూవీతో హీరోయిన్ గా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో ప్రియదర్శి(Priyadarshi)హీరో కాగా రాగ్ మయూర్, విష్ణు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. పక్కా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు(Bunny Vasu)భాను ప్రతాప నిర్మించగా, విజయేందర్ సత్తు(Vijayendhar sattu)దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలు కూడా మూవీపై మంచి ఆసక్తిని కలగచేస్తున్నాయి. నిహారిక రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు, గతంలో జరిగిన తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతు మిత్ర మండలిలోని అన్ని పాత్రలు ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తాయి. నేను కామెడీతో పాటు యాక్షన్ కూడా చేశాను. ప్రియదర్శి గారు సెట్ లో ఎంతో ఫ్రెండ్లీ గా ఉండేవారు. నా కాలేజీ రోజుల్లో యూట్యూబ్ ట్రెండ్ మొదలయ్యింది. టైం పాస్ కి యూ ట్యూబ్(You Tube)ఛానల్ పెట్టి వీడియోలు చేస్తుండే దాన్ని. రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆదాయం రాలేదు. దాంతో హాబీగా వీడియోలు చేస్తే చేసావు గాని, వృత్తిగా ఎంచుకున్నావంటే కాళ్ళు విరగ్గొడతామని అమ్మ నాన్న అనేవారు. కానీ ఇప్పుడు ఆ ఛానల్ నన్ను సినిమాల వరకు తీసుకొచ్చింది.
నా వరకు అయితే నేను చేసే సినిమా నా ఫ్యామిలీ మొత్తం చూడాలి. నాకు సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు మా వాళ్ళు కళ్లు మూసుకోకూడదని నిహారిక చెప్పుకొచ్చింది. చెన్నై చెందిన నిహారిక కి మిత్రమండలి రెండవ చిత్రం. మొదటి చిత్రం పెరుసు. తమిళంలో విడుదలైంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



