సుకుమార్ ప్రాజెక్ట్.. ఊహించని షాకిచ్చిన రామ్ చరణ్!
on Oct 10, 2025

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. 2026 జనవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశముంది అంటున్నారు. అయితే 'పెద్ది' షూటింగ్ పూర్తి కాగానే.. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా చరణ్ వెంటనే తన నెక్స్ట్ మూవీతో బిజీ కాబోతున్నారట.
రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేయనున్నాడు. 'రంగస్థలం' కాంబినేషన్ కావడంతో పాటు, 'పుష్ప' తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. కేవలం ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. గతంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి సైతం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఓపెనింగ్ సీక్వెన్స్ తనకు తెలుసని, అది చూసి ప్రేక్షకులు ఫిదా అవుతారని అన్నారు. దాంతో చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ పై అందరి ఆసక్తి రెట్టింపు అయింది. (RC17)
ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 ఫిబ్రవరి నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం. అంటే రామ్ చరణ్ జనవరిలో 'పెద్ది' పూర్తి చేసి, వెంటనే ఫిబ్రవరిలో సుకుమార్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టనున్నాడు అన్నమాట. నిజానికి చరణ్ 'పెద్ది' సినిమాలా మేకోవర్ కోసం టైం తీసుకుంటాడేమో, సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుందేమోనని భావించారంతా. కానీ, రామ్ చరణ్ మాత్రం తన స్పీడ్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు.
సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం' సినిమా నటుడిగా చరణ్ కి గొప్ప పేరు తీసుకొచ్చింది. అలాగే కమర్షియల్ గానూ బిగ్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు 'రంగస్థలం'కి మించిన సినిమాని అందించే పనిలో సుకుమార్ ఉన్నారు. అందుకే 'పుష్ప-2' విడుదలయ్యాక ఈ మూవీ స్క్రిప్ట్ కి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు ఏడాది సమయం తీసుకొని.. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్తున్నారని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



