బన్నీ సినిమాలపై క్లారిటీ.. ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంది!
on Jun 10, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని రెండో భాగం పూర్తి చేయనున్నారు. ఆ గ్యాప్ లో బన్నీ మరో మూవీ చేయనున్నాడు. అయితే ఆ మూవీ ఏంటనేది క్లారిటీ లేదు. వేణు శ్రీరామ్ తో లేదా బోయపాటి శ్రీనుతో బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది.
బన్నీ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు నేడు(జూన్ 11). ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. బన్నీ చేయబోయే తదుపరి చిత్రాల గురించి తెలియజేశారు. ప్రస్తుతం చేస్తోన్న పుష్ప పార్ట్ వన్ పూర్తి కాగానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమా చేస్తారని తెలిపారు. ఆ తర్వాత మురుగదాస్, బోయపాటి శ్రీను సినిమాలుంటాయన్న ఆయన.. ఈ రెంటిలో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుందనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత కొరటాల శివతో సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.
అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ సినిమా ఉంటుందని వాసు చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అల్లు అరవింద్ గారు మాట్లాడారని.. బన్నీ, ప్రశాంత్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుందని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



