`హరిహర వీరమల్లు` స్థానంలో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్?
on Jun 11, 2021

ఉగాది కానుకగా విడుదలైన `వకీల్ సాబ్`తో రి-ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన స్థాయికి తగ్గట్టే ఆరంభ వసూళ్ళతో అదరగొట్టిన ఈ కోర్ట్ డ్రామా.. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో ఆ తరువాత
బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. ఓవరాల్ గా.. జస్ట్ ఓకే ప్రాజెక్ట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో.. పవన్ నెక్స్ట్ వెంచర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ పైనే అందరి దృష్టి ఉందిప్పుడు. పవర్ స్టార్ బర్త్ డే
మంత్ అయిన సెప్టెంబర్ లో ఈ రీమేక్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడా ప్లాన్ మారింది.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. 2022 సంక్రాంతికి `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ని విడుదల చేయాలని టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ సీజన్ లోనే
పవన్ పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాకపోతే షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పుచేర్పుల వల్ల ఇప్పుడీ పాన్ - ఇండియా మూవీని 2022 వేసవికి జనం ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. మొత్తమ్మీద.. 2022 ముగ్గుల పండక్కి `హరిహర వీరమల్లు` స్థానంలో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ సందడి చేయనుందన్నమాట. త్వరలోనే ఈ రీమేక్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. `హరిహర వీరమల్లు`ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



