Bromance movie review: బ్రోమాన్స్ మూవీ రివ్యూ
on May 2, 2025
మూవీ: బ్రోమాన్స్
నటీనటులు: శ్యామ్ మోహన్, మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమ నంబియార్, సంగీత్ ప్రతాప్ తదితరులు
ఎడిటింగ్: చమన్ చాకో
మ్యూజిక్: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
నిర్మాతలు: ఆశిఖ్ ఉస్మాన్
దర్శకత్వం: అరుణ్ డి.జోస్
ఓటీటీ: సోని లివ్
కథ:
షింటో(శ్యామ్ మోహన్), బింటో(మ్యాథ్యు థామస్) అన్నదమ్ములు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. షింటో కొచ్చిలో ఉండి జాబ్ చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. బింటో న్యూఇయర్ సందర్భంగా కూర్గ్ లో పార్టీ చేసుకోడానికి ఫ్రెండ్స్ తో వెళ్తాడు. బింటో కూర్గ్ లో పార్టీలో ఉన్నప్పుడు షింటో ఫ్రెండ్ షబ్బీర్(అర్జున్ అశోకన్) కాల్ చేసి షింటో కనపడట్లేదు అర్జెంట్ గా కొచ్చి రమ్మంటాడు. దాంతో బింటో కొచ్చికి వెళ్తే ముందు రోజు బింటో తనను ఐశ్వర్య అనే ఒక అమ్మాయి మోసం చేసిందని ఏడ్చి వెళ్లిపోయాడని చెప్తాడు షబీర్. దీంతో బింటో వెళ్లి ఐశ్వర్య(మహిమ నంబియార్)తో గొడవ పడతాడు. షింటోని కనిపెట్టడానికి హరిహరసుధన్(సంగీత్ ప్రతాప్) అనే హ్యాకర్ హెల్ప్ తీసుకుంటాడు బింటో. ఈ క్రమంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. షింటోని వెతకడానికి ఐశ్వర్య కూడా బింటో, షబీర్, హరిహరసుధన్ తో కలుస్తుంది. అసలు షింటో ఏమైపోయాడు? షింటో – ఐశ్వర్యల కథ ఏంటి? ఐశ్వర్య ఎందుకు షింటోని వెతకడానికి వీళ్ళతో కలుస్తుంది? పోలీసులు ఏం చేసారో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే...
విశ్లేషణ:
మలయాళ సినిమాలు ఎంగేజింగ్ గా ఉంటు ఫుల్ గ్రిస్పింగ్ గా సాగుతాయనే అపోహ తెలుగు సినీ అభిమానులకి ఉంది అయితే అవి కొన్ని సినిమాలకు మాత్రమే అని ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. స్టోరీ లైన్ సింపుల్ తప్పిపోయిన అన్న కోసం తమ్ముడు వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదే కథ.. ఇంతే కథ.. ఇక దీనిని ఎంత ల్యాగ్ చేయాలో అంతా చేశారు. సరిగ్గా చూస్తే అరగంట కంటెంట్ కానీ రెండున్నర గంటల సినిమాగా రిలీజ్ చేశారు.
బ్రోమాన్స్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా కూడా అర్థం కాదు. సినిమా మొత్తంలో కొన్ని జోకులు బాగుంటాయి. మ్యూజిక్ ఒకే. కొంతమంది యూత్ కి మాత్రమే ఇది నచ్చుతుంది. ఎందుకంటే అంతగా ఏం లేదు డొల్ల. బ్రదర్ మిస్ అయ్యాడంటే సస్పెన్స్, ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ గా ఉండాలి కానీ దర్శకుడేమో కామెడీని చూపిస్తూ తీసుకెళ్ళారు. అది కుడా క్రింజ్ కామెడీ.
అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో చాలా వరకు ట్రిమ్ చేయాలి కానీ అలానే వదిలేసారు. అందుకే ఈ బ్రొమాన్స్ ని వదిలేస్తేనే బెటర్. అర్థం పర్ధం లేని సీన్స్, హ్యాకర్ తో కనిపెడ్డమేంటో లాజిక్ లెస్ సీన్లు బోలెడు.. ఎంతసేపు చూసినా సాగని కథ. పావుగంట సినిమాని రెండున్నర గంటల సాగదీశారు.
సినిమా మొత్తంలో బాగుందేంటంటే క్యారెక్టర్ల పర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ, కొన్ని జోకులు, మ్యూజిక్ ఇక మిగతాదంతా బోరింగ్. ఈ వీకెండ్ కాస్త వినోదాన్ని కోరుకుంటే ఈ సినిమా చూడొచ్చు ఎందుకంటే ఇందులో ఆ వినోదం కాస్తే ఉంటుంది.
నటీనటుల పనితీరు:
షింటోగా శ్యామ్ మోహన్, బింటోగా మ్యాథ్యూ థామాస్, షబ్బీర్ గా అర్జున్ అశోకన్, ఐశ్వర్యగా మహిమ నంబియార్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : మిస్సింగ్ ఎమోషన్ అండ్ సస్పెన్స్.. జస్ట్ ఒకే
రేటింగ్ : 2 / 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
