హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ విధంగా ఉంటాయని ఊహించలేదు
on May 2, 2025
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి వరుస హ్యాట్రిక్ హిట్ల తర్వాత నాని(Nani)నిన్న వరల్డ్ వైడ్ గా హిట్ 3 తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. 'అర్జున్ సర్కార్'(Arjun Sarkar) అనే ఐపీఎస్ అధికారి క్యారక్టర్ లో నాని ప్రదర్శించిన నటనకి అభిమాన,ప్రేక్షక లోకం బ్రహ్మరధం పడుతుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే నాని తన నట విశ్వరూపాన్ని చూపించాడని కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు.
ఈ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ గా నలబై మూడు కోట్లు రూపాయలు రాబట్టినట్టుగా నిర్మాణ సంస్థ అధికారకంగా తెలిపింది. దీంతో నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మూవీగా హిట్ 3 నిలిచిందని చెప్పవచ్చు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటం, ఇతర పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో హిట్ 3 రాబోయే రోజుల్లో రికార్డు కలెక్షన్స్ ని రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు లాంగ్ రన్ లో వంద కోట్ల క్లబ్ లోకి చేరాయి. హిట్ 3 తొలివారంలోనే ఆ ఘనత సాధిస్తుందని కూడా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ సీస్ లో అయితే స్టార్ హీరో రేంజ్ లో ఫస్ట్ డే నే హిట్ 3 వన్ మిలియన్ క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇక హిట్ 3 సక్సెస్ సెలబ్రెషన్స్ లో నాని మాట్లాడుతు ఈ విజయం నాది కాదు, తెలుగు సినిమాది. రాబోయే రోజుల్లో వచ్చే మిగతా సినిమాలు కూడా విజయాన్ని అందుకోవాలి. టికెట్ రేట్స్ ని పెంచుకునేలా ఏపిలో అనుమతి ఇచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ అని చెప్పాడు. హిట్ 3 ని ప్రశాంతి తిప్పరనేని తో కలిసి నాని నే సుమారు అరవై కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించాడు. కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)నానితో జత కట్టగా శైలేష్ కొలను(Sailesh Kolanu)దర్శకత్వం వహించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
