ఏంది 'బ్రో' ఇది.. నాలుగో రోజు పరిస్థితి దారుణం!
on Aug 1, 2023

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధానపాత్రలు పోషించిన 'బ్రో' సినిమా నాలుగో రోజైన సోమవారం నాడు కలెక్షన్లలో డ్రాప్ చూసింది. అయితే ఈ డ్రాప్ ఊహించిన దానికంటే భారీగా ఉంది. జూలై 28న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజులు రూ.30.01 కోట్ల షేర్, రూ.12.32 కోట్ల షేర్, రూ.12.93 కోట్ల షేర్ తో.. మొదటి వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.55.26 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఇక మూడో రోజుతో పోలిస్తే నాలుగోరోజు ఏకంగా 77 శాతం డ్రాప్ చూసింది. నాలుగో రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2.96 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.
నాలుగు రోజుల్లో నైజాంలో రూ.18.44 కోట్ల షేర్(బిజినెస్ రూ.30 కోట్లు), సీడెడ్ లో రూ.5.96 కోట్ల షేర్(బిజినెస్ రూ.13.20 కోట్లు), ఆంధ్రాలో రూ.22.52 కోట్ల షేర్(బిజినెస్ రూ.37.30 కోట్లు) రాబట్టిన బ్రో సినిమా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.46.92 కోట్ల షేర్(బిజినెస్ రూ.80.50 కోట్లు) వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.5.15 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.6.15 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.58.22 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.97.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బ్రో చిత్రం.. నాలుగు రోజుల్లో 59.7 శాతం రికవరీ చూసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు రూ.40 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే బయ్యర్లు కనీసం రూ.20-25 కోట్ల నష్టాలను చూసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రో నాలుగు రోజుల వసూళ్ళ వివరాలు:
నైజాం: రూ.18.44 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
సీడెడ్: రూ. 5.96 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.6.07 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
ఈస్ట్ గోదావరి: రూ.4.08 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ.3.84 కోట్లు
గుంటూరు: రూ.4.13 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
కృష్ణా: రూ.2.93 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
నెల్లూరు: రూ.1.47 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
ఆంధ్ర + తెలంగాణ మొత్తం: రూ.46.92 కోట్ల షేర్ (రూ.73.55 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ.5.15 కోట్లు
ఓవర్సీస్: రూ.6.15 కోట్లు
వరల్డ్ వైడ్: రూ.58.22 కోట్ల షేర్ (రూ.97.05 కోట్లు గ్రాస్)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



