మళ్లీ హిమాలయాలకు సూపర్‌స్టార్!
on Aug 1, 2023

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని తమిళనాడులో దేవుడిలాగా చూస్తారు. ఆయన మాటే శాసనం అక్కడ. ఆయన నటిస్తున్న సినిమా జైలర్ ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే సూపర్‌స్టార్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సినిమా విడుదల కాగానే హిమాలయాలకు వెళ్లడం సూపర్‌స్టార్‌కి ఎప్పటి నుంచో అలవాటు. హిమాలయాలకు, రజనీకాంత్‌కు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ప్రతి సినిమా షూటింగ్ పూర్తి కాగానే రిఫ్రెష్ కావడానికి, శక్తిని కూడగట్టుకోవడానికి హిమాలయాలకు వెళ్లడం ఆయనకు అలవాటే. అయితే 2010 తర్వాత ఆయన ఈ అలవాటుకు కామా పెట్టేశారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో హిమాలయాలకు వెళ్లడానికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పక్కన పెట్టిన అలవాటును కాలా తర్వాత మళ్లీ పట్టుకున్నారు. కాలా, 2.0 సినిమాల తర్వాత జర్నీని కంటిన్యూ చేశారు. ఆ వెంటనే కరోనా రావడంతో రెండేళ్లు వెళ్లలేకపోయారు. ఇప్పుడు జైలర్ విడుదలయ్యాక ఆనవాయితీని కంటిన్యూ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ జైలర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఆడియో లాంచ్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేదిక మీద ఎన్నెన్నో విషయాలను పంచుకున్నారు రజనీకాంత్. జైలర్ పూర్తి కాగానే మాల్దీవులకు వెళ్లొచ్చారు సూపర్‌స్టార్. మాల్దీవులకు వెళ్తే పుట్టింటిని చూసినంత ఆనందంగా ఉంటుందని అన్నారు. జైలర్‌లో ముత్తువేల్ పాండ్యన్‌గా నటించారు తలైవర్. డార్క్ కామెడీ థ్రిల్లర్ తరహా సినిమా ఇది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ విలన్‌గా నటించారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీ రోల్స్ చేశారు. జాకీ ష్రాఫ్, మోహనల్‌లాల్ గెస్ట్ రోల్స్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



