స్కిన్ కేర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమంత!
on Aug 1, 2023

సమంత రూత్ ప్రభు సినిమాల్లో నటించిన రోజుల కన్నా, బ్రేక్ తీసుకున్న తర్వాత ఫ్యాన్స్ కి రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. ఎక్కడున్నారు? ఏం ధరించారు? ఏం తిన్నారు? ఏం చేశారు? ఎలా ఉన్నారు? వంటి వివరాలన్నీ జనాలకు అర్థమయ్యేలా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈషా ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ గడిపిన క్షణాలను పంచుకున్నారు. బాలీ వెకేషన్‌కి వెళ్లినప్పుడు, అక్కడ చేసిన అన్ని సాహసాలను కళ్లకు కట్టేలా చూపించారు. సమంత మాత్రమే కాదు, ఆమె అభిమాన సైన్యం కూడా బాలీ వెళ్లొచ్చినంత డీటైలింగ్‌గా అనిపించాయి ఫొటోలు. ఇప్పుడు సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో వితౌట్ మేకప్ పిక్ షేర్ చేశారు. ఇటీవలే బాలీ ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చారు సమంత. వచ్చీరాగానే నో మేకప్ స్టిల్ పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.
హైదరాబాద్‌లో ప్రముఖ డెర్మటాలజిస్ట్ దగ్గర స్కిన్‌కీ, హెయిర్‌కీ సమంత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అద్దంలాంటి మెరిసే చర్మాన్ని ఇష్టపడతారు సమంత. మచ్చలు, మొటిమలు, డెడ్ స్కిన్ లేకుండా, ఫ్రెష్‌గా ఉండేలా చూసుకుంటారు. అందుకే నో మేకప్ స్టిల్స్ పోస్ట్ చేయడానికి అస్సలు మొహమాటపడరు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ముందు సమంత స్కిన్ చూసి ఫిదా అయ్యారు. అప్పట్లో సావిత్రికి ఇలాంటి చర్మం ఉండేది. ఇప్పుడు సమంతకు ఉంది. అదృష్టం అని పొగిడారు. అందుకేనేమో చర్మం విషయంలో అసలు నిర్లక్ష్యంగా ఉండరు సామ్. ఇప్పుడు కూడా ఆమె తీసుకుంటున్న ట్రీట్‌మెంట్ గురించి డీటైల్స్ చెప్పలేదు గానీ, చూసిన వారికి మాత్రం ఆమె ఏమీ చెప్పకపోయినా అర్థమవుతూనే ఉంది పరిస్థితి. సమంత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దాదాపు ఆరు నెలల పాటు విశ్రాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



