తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన 'బ్రహ్మాస్త్ర'
on Sep 10, 2022

భారీ అంచనాల నడుమ నిన్న(సెప్టెంబర్ 9న) విడుదలైన 'బ్రహ్మాస్త్ర' డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ మూవీగా 'బ్రహ్మాస్త్ర' నిలిచింది.
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తో పాటు కీలక పాత్రలో నాగార్జున నటించడం.. సౌత్ లో ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులు కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై బాగానే ఆసక్తి కలిగింది. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేశారు. దానికి తోడు చిరంజీవి వాయిస్ ఓవర్, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రెస్ మీట్ వంటివి ఈ చిత్రంపై ఇక్కడ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తగ్గట్టే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజు 'బ్రహ్మాస్త్ర' రూ.6.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో రూ.4.70 కోట్ల గ్రాస్ తో 'ధూమ్-3' పేరు మీద ఉన్న రికార్డు బద్దలైంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్ర రూ.5 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 11 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. 'బ్రహ్మాస్త్ర' జోరు చూస్తే తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



