పది భాషల్లో 'సూర్య 42'
on Sep 10, 2022

విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే సూర్య తన 42 సినిమాని మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన శివ కాంబినేషన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏకంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు.
యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రారంభమైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఈ మూవీ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన మూవీ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మోషన్ పోస్టర్ లో ఉన్న భారీతనాన్ని, భారీ యుద్ధ సన్నివేశాల చిత్రాలను చూస్తుంటే ఇది సౌత్ నుంచి రాబోతున్న మరో భారీ పాన్ ఇండియా ఫిల్మ్ అని అర్థమవుతోంది. ఇప్పటిదాకా యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అలరించిన డైరెక్టర్ శివ.. సూర్య కోసం ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేసినట్టు మోషన్ పోస్టర్ ని బట్టి చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సూర్య గొడ్డలి, విల్లు, బల్లెం ధరించి వీరుడిలా కనిపించనున్నాడని పోస్టర్ లో చూపించారు.

'సూర్య 42'కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. గతంలో సూర్య నటించిన 'ఆరు', 'సింగం' వంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన దేవి.. ఈ భారీ ప్రాజెక్ట్ తో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాకి రైటర్ గా ఆది నారాయణ, సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిసామి, ఎడిటర్ గా నిషాద్ యూసఫ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 3D లో రూపొందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



