ఒకే చోట ఉన్నా కలుసుకోలేకపోతున్న నయన్-విఘ్నేశ్!
on Dec 22, 2020
లాక్‌డౌన్ అనంతరం ఫిల్మ్ ఇండస్ట్రీ క్రమేణా సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ షూటింగ్ చేయడం రిస్క్‌గానే కనిపిస్తోంది. ఆమధ్య పుష్ప షూటింగ్ జరుగుతున్నప్పుడు, కొంతమంది యూనిట్ మెంబర్స్‌కు కొవిడ్ 19 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అర్ధంతరంగా షూటింగ్ నిలిపేసి, అందరూ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇదివరకు నిలిచిపోయిన పలు సినిమాల షూటింగ్స్ పునఃప్రారంభమయ్యాయి. వాటిలో రజనీకాంత్ సినిమా 'అణ్ణాత్తే' షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో డిసెంబర్ 15 నుంచి జరుగుతోంది. ప్రభుత్వం నిబంధనల మేరకు బయో-బబుల్ ప్రోటోకాల్ ప్రకారం పూర్తిగా ఇండోర్‌లోనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా, ప్రకాశ్ రాజ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, నయనతార, ఖుష్బూ, మీనాలపై సీన్లు తీస్తున్నారు. బయో-బబుల్ ప్రోటోకాల్ ప్రకారం షూటింగ్ జరుగుతున్నంత సేపూ నటీనటులు సహా యూనిట్ మెంబర్స్ ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. అలాగే బయటి వ్యక్తులెవరూ లోనికి రావడానికి లేదు. అంటే యూనిట్ మెంబర్స్ అందరూ షూటింగ్ లొకేషన్‌లోనే మకాం చేస్తున్నారన్న మాట.
మరోవైపు నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ సైతం తన 'కాదు వాకుల రెండు కాదల్' షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. విజయ్ సేతుపతి, సమంతలపై సన్నివేశాలు తీస్తున్నాడు. ఒకే సిటీలో ఉన్నప్పటికీ, బయో-బబుల్ కారణంగా నయన్, విఘ్నేశ్ కలుసుకోలేకపోతున్నారు. దీంతో నయన్ సంగతేమో కానీ విఘ్నేశ్ తెగ బాధపడిపోతున్నాడని ఇన్‌సైడర్స్ టాక్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
