బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కుటుంబం గురించి తెలుసా?
on Dec 22, 2020
శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి, అందంతో, అభినయంతో ఆకట్టుకున్నాడు అభిజీత్. ఆ తర్వాత 'రామ్ లీలా', 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాల్లో, 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌లో హీరోగా నటించాడు కానీ.. ఎందుకనో కెరీర్‌లో ఊహించనట్లు ఎదగలేకపోయాడు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లాక అదివరకటి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఇక విన్నర్‌గా నిలిచాక అతడి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అతడి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతూ వస్తున్నారు.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాకి హీరోగా ఎంపికయ్యే సమయానికి అభిజీత్ జేఎన్‌టీయూలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ సినిమా చేశాక మసాచుసెట్స్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అభిజీత్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఉంటోంది. వాళ్లు ఇప్పుడుంటున్న ఇల్లు అభిజీత్ వాళ్ల తాతయ్య నాగయ్య 80 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కావడం గమనార్హం. అభిజీత్ తల్లి లక్ష్మీప్రసన్న కేటరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చేసినప్పటికీ గృహిణిగా స్థిరపడ్డారు. తండ్రి మన్మోహన్ గతంలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేసి, ఇప్పుడు అగ్రికల్చరల్ ఫార్మింగ్‌లో ఉన్నారు. తండ్రికి తోడుగా అభిజీత్ తమ్ముడు అభయ్ ఆ పనులను చూసుకుంటున్నాడు.
బిగ్ బాస్ విన్నర్ అయ్యాక అభిజీత్ కోసం సినిమా ఆఫర్స్ రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే 32 సంవత్సరాల మళ్లీ సినిమాల్లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
