'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్.. బాబాయ్ అబ్బాయ్ వస్తున్నారా?
on Jul 24, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారైంది. అయితే ఈ ఈవెంట్ కోసం నందమూరి స్టార్స్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ ను జూలై 29న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఈవెంట్ కి బాలయ్య, తారక్ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. బాబాయ్-అబ్బాయిలు లాస్ట్ టైమ్ 'అరవింద సమేత', 'ఎన్టీఆర్ బయోపిక్', '118' వేడుకల్లో ఒకే వేదికపై సందడి చేశారు. ఇప్పుడు 'బింబిసార' కోసం ముగ్గురు నందమూరి హీరోలు మరోసారి ఒకే వేదికపై కనిపిస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. కాగా ఇప్పటికే ఈ మూవీ స్పెషల్ ప్రివ్యూ చూసిన తారక్.. మూవీ టీమ్ ని ప్రశంసించాడని టాక్.

ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



