విజయ్ కొత్త సినిమా 'దోషి' ఫస్ట్ లుక్ విడుదల!
on Jul 24, 2022

'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న సినిమా 'దోషి'. మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీసన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి ధనుంజయన్, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. సీఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న దోషి సినిమా ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.
ఇప్పటిదాకా మానవాళి చరిత్రలో జరగని క్రైమ్ డ్రామా కథగా ఈ సినిమా ఉండనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'తమీజ్ పాడమ్' లాంటి హిలేరియస్ స్పూఫ్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు సీఎస్ అముదన్ ఈసారి క్రైమ్ డ్రామా జానర్ లో దోషి చిత్రాన్ని తెరకెక్కించారు.

జగన్, నిళల్ గల్ రవి, జాన్ మహేంద్రన్, కలై రాణి, మహేష్, ఓక్ సుందర్, మీషా ఘోషాల్, అమేయా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా గోపీ అమర్నాథ్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



