నాగ చైతన్య సినిమాలో వంటలక్క!
on Oct 14, 2022

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎందరో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారిలో వంటలక్క కూడా ఉండటం విశేషం.
'NC 22'లో నటిస్తున్న నటీనటుల వివరాలను ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ తాజాగా తెలిపింది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రేంజీ అమరేన్, సంపత్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారితో పాటు 'కార్తీకదీపం' సీరియల్ ద్వారా వంటలక్కగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాధ్ సైతం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది.
శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతన్య జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్. కథీర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



