'ఐ లవ్ యు' అంటే లిప్ కిస్ ఇచ్చేస్తుంది!
on Dec 14, 2022

గుంటూరు మిర్చి హిమజ బుల్లితెర మీద ఫుల్ ఫేమస్ పర్సన్. స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూనే అవకాశం వస్తే మూవీస్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హిమజ.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది. తర్వాత 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి', 'వరుడు కావలెను', 'శతమానంభవతి', 'స్పైడర్' వంటి మూవీస్ లో హిమజ నటించింది. ఆ తరవాత బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటో షూట్స్, పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది.

ఈమె తన పెట్ తో ట్రావెల్ చేస్తూ చేసిన ఒక రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. స్మాల్ స్క్రీన్ సెలెబ్స్ కి చాలా మందికి కూడా కుక్కపిల్లలు, చిలుకలు అంటే చాలా ముచ్చటపడుతూ ఉంటారు. ఆ రేస్ లో ముందుండేది రష్మీ, సుమ, అష్షు, అనసూయ ఇప్పుడు హిమజ. పెట్స్ మీద మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంతకు రెట్టింపు ప్రేమ అవి కూడా చూపిస్తాయి అని చెప్పింది. "నేను ఐ లవ్ యు అని చెప్పగానే మా రియో రియాక్షన్ చూడండి" అనేసరికి "రియో కూడా సూపర్ గా లిప్ కిస్ ఇచ్చేసింది" ఆ ముద్దుకు ఫిదా ఐపోయిన హిమజ "ఐ లవ్ యు" అని చెప్పేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



