బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక.. నయీమ్, ముష్ఫికర్ హాఫ్ సెంచరీస్!
on Oct 24, 2021

దుబాయ్‌లోని షార్జా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకకు 20 ఓవర్లలో 172 రన్స్ టార్గెట్ ఇచ్చింది బంగ్లాదేశ్ టీమ్. బ్యాటింగ్‌కు కష్టతరమైన పిచ్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్స్ బ్రహ్మాండంగా రాణించి నిర్దేశిత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేశారు. ఓపెనర్ మహమ్మద్ నయీమ్, నాలుగో నంబర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అంచనాలకు మించి రాణించి చెరో అర్ధ సెంచరీ సాధించారు.
మొదట్లో బంగ్లాదేశ్ బ్యాటర్స్ రన్స్ తీయడానికి ఇబ్బందిపడ్డారు. ఓపెనర్ లిట్టన్ దాస్ (16 బాల్స్‌లో 16 రన్స్), వన్‌డౌన్ బ్యాటర్ షకీబ్ అల్ హసన్ (7 బంతుల్లో 10 పరుగులు) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. దీంతో మరో ఓపెనర్ నయీమ్ యాంకర్ రోల్ పోషించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన అతను ఆ తర్వాత బ్యాట్ ఝళిపించాడు. 52 బాల్స్‌లో 62 రన్స్ చేశాక బినుర ఫెర్నాండో బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 37 బంతుల్లో 57 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని రన్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఆఖరులో 5 బంతులెదుర్కున్న మరో కెప్టెన్ మహ్మదుల్లా రెండు ఫోర్లు కొట్టి స్కోరును 170 పరుగులు దాటించాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నే, ఫెర్నాండో, లహిరు కుమార తలో వికెట్ తీశారు. కరుణరత్నే పొదుపుగా బౌలింగ్ చేసి, 3 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



