ఫస్ట్ వీడి పెళ్లి, తర్వాతే నాది.. తేల్చేసిన రౌడీ హీరో!
on Oct 24, 2021
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'పుష్పక విమానం' మూవీకి విజయ్ దేవరకొండ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీతో డైరెక్టర్‌గా దామెదర ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. గీత్ సైని, సాన్వే మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. 'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీస్ తర్వాత ఆనంద్ నటించిన 'పుష్పక విమానం'పై ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను తన యూట్యూబ్ చానల్‌లో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. ఇందులో తనదైన స్టైల్‌లో అతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రోమో మొదట్లోనే "పెళ్లి కూడా వీడిదే ఫస్ట్ అయితది" అని తమ్ముడ్ని ఉద్దేశించి చెప్పాడు విజయ్. అయితే అన్నదే మొదట అవుతుందన్నట్లు అతడి వేపు వేలు చూపించాడు ఆనంద్.
ఏ విషయం ప్రస్తావనకు వచ్చిందో తెలీదు కానీ, "ఇట్లాంటి రిస్కులన్నీ నామీద పెడతాడు" అన్నాడు అన్నను ఉద్దేశించి ఆనంద్. "రెండు నెలలు హాలిడేస్‌కు ఇంటికి రాగానే చుక్కలు చూపించెటోడు" అని ఆనంద్ గురించి చెప్పాడు విజయ్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఆనంద్ యు.ఎస్.లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు.
ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ ఒకరి గురించి మరొకరు చాలా విషయాలే బయట పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఆ బ్రదర్స్ మధ్య అనుబంధానికి ఈ ఇంటర్వ్యూ అద్దం పడుతుందని కూడా ఆశించవచ్చు. 25న ఫుల్ ఇంటర్వ్యూ మన ముందుకు రానున్నది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
