నాగ్ కి `మజ్ను`.. చైతూకి `బంగార్రాజు`..!
on Jan 10, 2022

కథానాయకుడిగా యువ సామ్రాట్ నాగచైతన్యది 12 ఏళ్ళ సినీ ప్రస్థానం. అయితే, ఇన్నేళ్ళ కెరీర్ లో చైతూ ఎన్నడూ సంక్రాంతి సీజన్ లో తన సినిమాతో సందడి చేసేందే లేదు. కట్ చేస్తే.. `బంగార్రాజు`తో ఆ ముచ్చట తీరబోతోంది. అంతేకాదు.. ఇందులో తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి ఎంటర్టైన్ చేయనున్నాడు చైతూ. నాగ్ కి మనవడిగా, చిన్న బంగార్రాజుగా ఈ విలేజ్ డ్రామాలో దర్శనమివ్వనున్నాడీ `మజిలీ` స్టార్.
Also Read: `బంగార్రాజు`.. నాగ్ కి పొంగల్ ఫస్ట్ మల్టిస్టారర్!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నాగార్జున తొలి సంక్రాంతి రిలీజ్ `మజ్ను`(1987) 35 ఏళ్ళ క్రితం ఏ తేదీన అయితే విడుదలైందో.. సరిగ్గా అదే జనవరి 14కే చైతూ మొదటి ముగ్గుల పండగ సినిమా `బంగార్రాజు` కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి.. నాగ్ కి ఫస్ట్ పొంగల్ రిలీజ్ `మజ్ను` ఎలాగైతే మెమరబుల్ మూవీగా నిలిచిందో.. అలాగే చైతూకి కూడా `బంగార్రాజు` ఫలితం అలాంటి మధుర జ్ఞాపకంలా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా రూపొందిన `బంగార్రాజు`ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించగా.. నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, చైతూకి జోడీగా `ఉప్పెన` భామ కృతి శెట్టి కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ బాణీలు అందించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



