Home

»

Latest News

`బంగార్రాజు`.. నాగ్ కి పొంగ‌ల్ ఫ‌స్ట్ మ‌ల్టిస్టార‌ర్!

Jan 07, 2022

`మ‌జ్ను`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా`.. ఇలా కింగ్ నాగార్జున‌కి గుర్తుండిపోయే విజ‌యాల‌ను అందించింది సంక్రాంతి సీజ‌న్. అలాంటి ఈ సీజ‌న్ లో `సోగ్గాడే చిన్ని నాయ‌నా` విడుద‌లైన ఆరేళ్ళ త‌రువాత మ‌రో పొంగల్ స్పెష‌ల్ మూవీతో రాబోతున్నారు నాగ్. ఆ సినిమానే.. `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి సీక్వెల్ గా రూపొందిన ఈ గ్రామీణ నేప‌థ్య చిత్రం.. ముగ్గుల పండ‌గ కానుక‌గా జ‌న‌వ‌రి 14న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `బంగార్రాజు`లో నాగార్జున‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా మ‌రో హీరోగా న‌టించాడు. ఆ ర‌కంగా.. ఇదో మ‌ల్టిస్టార‌ర్ అనే చెప్పాలి. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. సంక్రాంతి సీజ‌న్ లో నాగ్ క‌థానాయ‌కుడిగా ఇంత‌కుముందు ఐదు చిత్రాలు సంద‌డి చేయ‌గా.. అవ‌న్నీ సోలో హీరో స‌బ్జెక్ట్ లే. సో..  `బంగార్రాజు` పొంగ‌ల్ టైమ్ లో సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌స్తున్న నాగ్ ఫ‌స్ట్ మ‌ల్టిస్టార‌ర్ రిలీజ్ అన్న‌మాట‌. మ‌రి.. త‌న కెరీర్ లో ఫ‌స్ట్ పొంగ‌ల్ మ‌ల్టిస్టార‌ర్ గా రాబోతున్న `బంగార్రాజు`తో నాగ్ ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటారో చూడాలి.

కాగా, `బంగార్రాజు`లో నాగ్ కి జంట‌గా ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నుండ‌గా.. చైతూకి జోడీగా కృతి శెట్టి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com