1995 కాలం నాటి కథాంశంలో రష్మిక!
on Jan 10, 2022

`పుష్ప - ద రైజ్`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ఒకవైపు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉందీ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నిర్దేశకత్వంలో రష్మిక ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇదో పిరియడ్ డ్రామా అట. 1995 కాలం నాటి కథాంశంతో ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. కిరాణా కొట్టు వాడి కూతురు పెద్ద బిజినెస్ విమెన్ గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందట. అంతేకాదు.. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న తరుణంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టిన టైమ్ లైన్ ని ఈ చిత్రానికి నేపథ్యంగా తీసుకున్నాడట రాహుల్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
మొత్తమ్మీద.. కెరీర్ లో ఫస్ట్ విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తున్న రష్మిక.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే అభిమానుల ముందుకు రాబోతుందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



