'వీరసింహా రెడ్డి'లో బిగ్ సర్ ప్రైజ్.. ట్రిపుల్ రోల్ లో బాలయ్య!
on Dec 21, 2022

కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ తన సినిమాలలో డ్యూయల్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నాడు. గత చిత్రం 'అఖండ'లో సైతం ద్విపాత్రాభినయంతో అదరగొట్టి భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే త్వరలో విడుదల కానున్న 'వీరసింహా రెడ్డి'లో కూడా ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ఇప్పటికే తెలిసిందే. అయితే ఈ మూవీలో బిగ్ సర్ ప్రైజ్ ఉందని.. బాలకృష్ణ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. రెండు విభిన్న గెటప్స్ లో బాలయ్య లుక్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. అయితే సినిమాలో బాలకృష్ణ మూడో గెటప్ లో కూడా కనిపించనున్నాడని న్యూస్ వినిపిస్తోంది. ఆ పాత్ర ఒక సర్ ప్రైజ్ లా బిగ్ ట్విస్ట్ తో రివీల్ అవుతుందని టాక్. ఆ సన్నివేశం ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ చిత్రంలో బాలయ్య నిజంగానే త్రిపాత్రాభినయం చేస్తున్నాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2023, జనవరి 12న విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



