బిచ్చగాడు మరలా కం బ్యాక్ ఇస్తాడా?
on Dec 21, 2022

తమిళం నుండి తెలుగులోకి వచ్చిన అతి చిన్న డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు. తమిళంలో సంగీత దర్శకునిగా మంచి పేరున్న విజయ్ ఆంటోని ఇందులో హీరో. ఈయన తెలుగులో కూడా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మహాత్మ చిత్రానికి సంగీతం అందించాడు. ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. 2013లో నకిలీ 2017లో డాక్టర్ సలీం 2016లో బేతాళుడు 2017లో ఇంద్రసేన చిత్రాలతో ఓకే అనిపించుకున్న ఆయన తమిళంలో వచ్చిన పిచ్చయికారణ్ అనే చిత్రాన్ని తెలుగులో బిచ్చగాడుగా విడుదల చేశాడు.
ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మహా మహా విమర్శకులు కూడా ఈ చిత్రానికి నీరాజనం పలికారు. కైకాల సత్యనారాయణ తో పాటు ఎందరో ఈ చిత్రాన్ని బాహుబలి తో పోలుస్తూ బాహుబలి వంటి తలా తోక లేని చిత్రాలు తీయడం కన్నా కాస్త సమాజానికి ఉపయోగపడే బిచ్చగాడు లాంటి చిత్రాలు చేయడం... చూడటం మంచిదని కితాబునిచ్చారు. కానీ బిచ్చగాడు తర్వాత ఆయన చేసిన కిల్లర్ జ్వాలా విజయ రాఘవన్ ఇలా దాదాపు డజను చిత్రాలు సరిగా మెప్పించకపోవడంతో ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించలేదు. దాంతో ఈయనను కూడా వన్ మూవీ వండర్ అని అందరూ అంటూ వచ్చారు. బిచ్చగాడు తర్వాత ఈయన హీరోగా నటించిన చిత్రాల విషయానికి వస్తే అతని స్క్రిప్ట్ ఎంపికలు ప్రతిసారి హాట్ టాపిక్ అవుతున్నాయనే గాని ఎందుకో విజయాలు మాత్రం దక్కడం లేదు. దాంతో వరుస ఫ్లాప్‌లు చవిచూడాల్సి వచ్చింది. నటుడిగా పెద్ద గ్యాప్ వచ్చింది. మరలా ట్రాక్ లోకి రావాలంటే బిచ్చగాడు వంటి హిట్టును కొట్టాలి. అందుకే బిచ్చగాడు 2 అనే సినిమాతో ఆయన కం బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
తాజాగా విజయ్ ఆంటోని పిచ్చయ్యకారన్ 2 ను తమిళంలో ప్రారంభించాడు. ఇదే చిత్రం బిచ్చగాడు 2 గా తెలుగులో విడుదల కానుంది. ఈ సీక్వెల్ ను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం లో కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కానుంది. నాలుగు భాషలలో పిచ్చయ్య కారన్ 2 కొత్త పోస్టర్స్ విజయ్ ఆంటోనీ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ మూవీ శాటిలైట్ డిజిటల్ హక్కులను కూడా స్టార్ నెట్వర్క్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుండే సీక్వెల్ కథ కంటిన్యూ అవుతుంది.
ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ దర్శకుడు కూడా. కథ, కథనం, సంగీత దర్శకత్వం వంటివన్నీ ఆయనే నిర్వర్తిస్తున్నాడు. మొత్తానికి విజయ్ ఆంటోని వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా కూడా బిచ్చగాడు 2 కోసం మొత్తం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు. వరుస పరాజయాలతో కెరీర్ డౌన్ ఫాల్ కావడంతో ఈసారి ఎలాగైనా భారీ హీట్ కొట్టి తన సత్తా నిరూపించుకోవాలని కసిగా ఉన్నాడు విజయ్ ఆంటోని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



