నేను తప్పులు చేస్తా... నాకు తెలుసు
on Dec 18, 2019

నటనలో ఎప్పటికీ పర్‌ఫెక్షనిస్ట్ కాలేమని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. హండ్రెడ్ పర్సెంట్ పర్‌ఫెక్ట్‌గా చేశామని భావిస్తే అక్కడితో కెరీర్ ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఎంత బాగా నటించినప్పటికీ మరో మెట్టు పైకి చేసే అవకాశం ఉంటుందని బాలకృష్ణ అన్నారు. ఆర్టిస్ట్ చాలా ప్రయాణం చేయవలసి ఉంటుందని, ఎన్నో పాత్రలు చేస్తారని ఆయన తెలిపారు.
"నన్ను అందరూ పర్‌ఫెక్షనిస్ట్ అంటారు. కానీ, నేను తప్పులు చేస్తాను (నటనలో). నాకు తెలుసు. ఎవరైనా నన్ను పర్‌ఫెక్షనిస్ట్ అంటే ఇటువంటివి వద్దని చెబుతా. ఓ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత సినిమా పూర్తి అయ్యాక ఆ పాత్ర నుండి బయటకు వస్తాను" అని బాలకృష్ణ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఏ పాత్రనూ కష్టం అనుకోనని, ఇష్టపడి చేస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విడుదల కానున్న 'రూలర్' ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



