రోమ్ వెళ్లిన నితిన్... రష్మిక
on Dec 18, 2019

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన యంగ్ హీరో నితిన్, ప్రజెంట్ యూత్ హాట్ ఫేవరెట్ హీరోయిన్ రష్మిక రోమ్ వెళ్లారు. వీళ్ళిద్దరూ వెళ్ళింది 'భీష్మ' పాటల చిత్రీకరణ కోసం! 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. రోమ్ లో చిత్రీకరించే పాటలతో సినిమా పూర్తవుతుందని సమాచారం. ఈ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంతకుముందు రాజమండ్రి లో చిత్రీకరించిన 'భీష్మ' పాటలు కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు. నిజానికి, ఈ సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తొలుత క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదల చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే... బాలకృష్ణ 'రూలర్', సాయి తేజ్ 'ప్రతిరోజూ పండగే', రాజ్ తరుణ్ 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్లారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



