రవితేజ పంచచిత్ర ప్రణాళిక ఫలిస్తుందా?
on Nov 26, 2021

వరుస పరాజయాల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజకి.. `క్రాక్` ఘనవిజయం నూతనోత్తేజాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే.. వరుస చిత్రాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారాయన. అలాగే.. ఒకదానితో ఒకటి పొంతన లేని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రవితేజ చేతిలో 5 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే.. `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు`.
రమేశ్ వర్మ డైరెక్ట్ చేసిన `ఖిలాడి` యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందగా.. అందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు రవితేజ. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక చిత్రీకరణ తుది దశకు చేరుకున్న శరత్ మండవ డైరెక్టోరియల్ `రామారావు ఆన్ డ్యూటీ`.. ఓ ఫ్యామిలీ థ్రిల్లర్. ఇది కూడా 2022 ప్రథమార్ధంలో విడుదలయ్యే అవకాశముంది. ఇక కామిక్ ఎంటర్టైనర్ గా త్రినాథరావ్ నక్కిన తెరకెక్కిస్తున్న `ధమాకా`.. వచ్చే సంవత్సరం సెకండాఫ్ లో రాబోతోంది. అలాగే సుధీర్ వర్మ రూపొందిస్తున్న `రావణాసుర` కూడా విభిన్న ప్రయత్నమే. అదేవిధంగా వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న పాన్ - ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`.. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్. ఈ రెండు సినిమాలు కూడా 2022 చివరలో లేదా 2023 ఆరంభంలో రిలీజ్ కావచ్చంటున్నారు.
మరి.. ఐదు విభిన్న కథాంశాలతో మాస్ మహారాజా రవితేజ వేసిన ఈ పంచచిత్ర ప్రణాళిక ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



