వెబ్ సిరీస్ లో నితిన్?
on Nov 26, 2021

కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయికలు వెబ్ - సిరీస్ లపై దృష్టి సారించగా.. స్టార్ హీరోలు కూడా ఇప్పుడిప్పుడే ఆ వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా, నాగచైతన్య వంటి టాలీవుడ్ స్టార్స్.. ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. త్వరలో ఈ ముగ్గురు కూడా వెబ్ - సిరీస్ ల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. వెంకీ, రానా, చైతూ బాటలోనే మరో టాలీవుడ్ హీరో కూడా వెబ్ - సిరిస్ చేయనున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. యూత్ స్టార్ నితిన్. ఇటీవలే `మాస్ట్రో` చిత్రంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా ఎంటర్టైన్ చేసిన నితిన్.. త్వరలో ఓ వెబ్ - సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇందులో భాగంగా కథలు వింటున్నారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజకవర్గం` అనే చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ కి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



