ప్రభాస్.. ఇండియన్ నయా సూపర్ స్టార్ అయిపోయాడా?
on Jul 15, 2015

ఒక్క సినిమా వెయ్యి మెట్లెక్కించడం అంటే ఏంటో బాహుబలిని చూస్తే అర్థమవుతుంది. బాహుబలికి ముందు, ఆ తరవాత ప్రభాస్ ఏంటి? అని ఆలోచించుకొంటే అర్థమవుతుంది. ఈ ఒక్క సినిమా ప్రభాస్‌ని దేశమంతా పాపులర్ చేసింది. ఇది వరకు ప్రభాస్ అంటే.. టాలీవుడ్‌కి మహా అయితే కోలీవుడ్‌కి మాత్రమే తెలుసు. బాహుబలితో ప్రభాస్ బాలీవుడ్‌కీ ఘనంగా పరిచయమయ్యాడు. బాహుబలి సృష్టిస్తున్న రికార్డుల గురించీ, రాజమౌళి గురించి బాలీవుడ్‌లో ఎంత ఘనంగా మాట్లాడుకొంటున్నారో, ప్రభాస్ గురించీ అంతే ఇదిగా చర్చించుకొంటున్నారు. ఓ టాలీవుడ్ హీరో ధీరత్వాన్నీ, వీరత్వాన్నీ అక్కడ పొగుడుతున్నారు.
అవును మరి.. తొలి రోజు రూ. 73 కోట్లు తెచ్చి పెట్టిన హీరో అంటే క్రేజ్ ఉండదా??? తప్పకుండా ఉండాల్సిందే. బాహుబలి ద్వారా ప్రభాస్ ఆ ఘనత సాధించాడు. దక్షిణాదికి చెందిన ఓ కథానాయకుడు ఉత్తరాదిన జెండా ఎగరేయడం చాలా అరుదైన సంగతే. రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్...ఇలా చాలామంది అలాంటి ప్రయత్నాలు చేశారు.కానీ.. ఎవ్వరికీ ఇలాంటి ఘనత మాత్రం సాధ్యం కాలేదు. బాలీవుడ్‌లో భారీగా రిలీజై... తొలి రోజు నుంచీ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.. బాహుబలి. తొలి రోజు రూ.5.5 కోట్లు రాబట్టిన బాహుబలి.. రెండో రోజు 7 కోట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడో రోజు కలెక్షన్లు మరింతగా పెరిగాయి. దాంతో.. బాలీవుడ్ అంతా ఇప్పుడు ప్రభాస్ గురించి ఆరా తీయడం మొదలెట్టింది. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సృష్టించిన రికార్డుల్ని చెదలు పట్టిస్తున్న మొనగాడు... ప్రభాస్ అని సగర్వంగా కితాబులు ఇచ్చేసింది. దాంతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీసుకి నయా సూపర్ స్టార్‌గా అవతరించినట్టైంది. ప్రభాస్ గురించీ, బాహుబలి గురించీ, రాజమౌళి టేకింగ్ గురించీ.. బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. అక్కడి సమీక్షలు కూడా బాహుబలికి అగ్రతాంబూలమిచ్చాయి.
ఓ అనువాద చిత్రంగా కాకుండా స్ట్రయిట్ సినిమాగానే బాహుబలిని గుర్తించాయి. మన తెలుగు సినిమాకి ఇంతకంటే ఘనమైన కీర్తి మరోటి ఉంటుందా..? అందుకే ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు. జయహో బాహుబలి అంటూ మరోసారి నినదిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



