బాహుబలిని కాపీ కొడుతున్న - శ్రీమంతుడు?
on Jul 15, 2015
.jpg)
తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. తొలి రోజే రూ.73 కోట్లకు పైచిలుకు గ్రాస్ సాధించి ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సంచలనానికి ఈ సినిమాకొచ్చిన హైప్ ఓ కారణమైతే.. చిత్రబృందం ఫాలో అయిన మార్కెట్ స్ట్రాటజీ మరో కారణం. పబ్లిసిటీ విషయంలో బాహుబలి టీమ్ కొత్త పంథా అనుసరించింది. ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టకుండా కోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీ చేసింది. ఈ ప్లాన్... ఇప్పుడు శ్రీమంతుడు టీమ్‌కీ నచ్చింది. వాళ్లు కూడా సేమ్ ఇదే మార్కెట్ స్ట్రాటజీతో తమ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకోవాలని చూస్తోంది. సినిమా విడుదలయ్యేలోగా వీలుచిక్కినప్పుడల్లా.. శ్రీమంతుడు పోస్టర్లను ఒకొక్కటిగా విడుదల చేస్తూ.. ఈ సినిమాని పబ్లిసిటీ చేద్దామనుకొంటోంది టీమ్.
బాహుబలి ఈ రేంజులో వసూళ్లు సాధించడానికి కారణం.. అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేయడమే. ఏ థియేటర్‌కి వెళ్లినా.. అక్కడ బాహుబలి పోస్టరే కనిపిస్తోంది. ఆసినిమానే ఆడుతోంది. అందుకే.. శ్రీమంతుడు టీమ్ కూడా ఇదే ఫార్ములా అనుసరించాలని చూస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర్రాల్లో దాదాపుగా 1800 థియేటర్లున్నాయి. అందులో 1600 థియేటర్లలో శ్రీమంతుడుని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. విడుదలకు ఒక్కరోజు ముందు.. ప్రీమియర్ షోలను భారీ ఎత్తున ప్రదర్శించాలని చూస్తోంది.
ప్రీమియర్ షోల రూపంలో కనీసం రూ.4 నుంచి 8 కోట్ల రూపాయల వరకూ వెనకేయాలని చూస్తోంది. శ్రీమంతుడు ఒక్కటే కాదు... ఇక నుంచి పెద్ద సినిమాలన్నీ ఈ ప్రీమియర్ షోలపై దృష్టి పెట్టడం ఖాయం. మొత్తానికి రాబోయే పెద్ద సినిమాలకు బాహుబలి ఓ పాఠంలా, దిక్చూచీలా మిగిలిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



