రకుల్‌కి ఎంత పొగరో..?!
on Jul 14, 2015
.jpg)
ఒకట్రెండు విజయాలు చేతిలో పడగానే, నాలుగైదు ఆఫర్లు అందుకోగానే హీరోయిన్లకు కాలు నేలమీద నిలవదు. అనుకోకుండా వచ్చిన క్రేజ్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. ఆకాశంలో విహరిస్తుంటారు. అలాంటప్పుడు కిందున్నవాళ్లు ఏం కనిపిస్తారు.??? దాంతో అవాకులూ చెవాకులూ పేలిపోతుంటారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ పరిస్థితీ అంతే. టాలీవుడ్‌లో బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది రకుల్ బండి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ సినిమాలలో ఆఫర్లు అందుకొని.. టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడామె కళ్లకు బడా హీరోయిన్లు కూడా ఆనండం లేదు. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో తనకంటే సీనియర్ హీరోయిన్లయిన త్రిష, కాజల్, అసిన్‌లను కాస్త చులకనగా మాట్లాడి... టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. త్రిష, కాజల్‌లతో తనని పోలుస్తున్నారని, అయితే వాళ్లెవరూ బాలీవుడ్‌లో నెగ్గుకు రాలేదని, అలాంటివాళ్లతో పోలిస్తే తనకు ఇబ్బందిగా ఉంటుందని కలరింగు ఇస్తోంది రకుల్. అంతేకాదు.. నిలకడగా విజయాలు సాధించడం తనకు హాబీ అయిపోయిందని, ఇన్నింగ్స్ ముగిసిన వాళ్లతో పోలిస్తే తాను తట్టుకోలేనని పరోక్షంగా తన సీనియర్లపై సెటైర్లు వేసింది. రకుల్ దూకుడు చూసి.. మీడియా సైతం ముక్కున వేలేసుకొంటోంది. రెండు మూడు విజయాలకే ఇలా పొంగిపోతూ.. తన సీనియర్లను తక్కువ చేసి మాట్లాడడం రకుల్ సన్నిహితుల్నీ షాక్‌లో పడేసింది.
మీడియా ముందు ఇలా మాట్లాడడం భావ్యం కాదని రకుల్ సన్నిహితులు సైతం సలహాలు ఇస్తున్నారట. ఆ మాటలూ తలకెక్కించుకొనేలా లేదు ఈ అమ్మడు. ఇది పొగరనాలో, లేదంటే పొగరుతో కూడిన ఆహంకారంతో వచ్చిన గర్వం అనాలో టాలీవుడ్‌కీ అర్థం కావడం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



