అందరికీ అందుబాటులో బాహుబలి 2
on Apr 26, 2017
.jpg)
ఈ నెల 28 న బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవనుంది. ఒక రోజు ముందుగా, అంటే రేపు హైదరాబాద్ లో చాలా థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఏషియన్ థియేటర్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రతి ఏషియన్ మల్టిప్లెస్ లో బాహుబలి 2 మూడు షోలు 9 :30 - 11 ; 30 మధ్య టైం లో వేయనున్నారు. ఇందులో గొప్పేం ఉంది టికెట్ ప్రయిజ్ వేలల్లో ఉంటుంది కదా అనే కదా మీ డౌట్. అలాంటి సందేహం ఏం అక్కర్లేదు. అందరికీ అందుబాటులో ఉండే రేటే ఫిక్స్ చేసారు. ఇంతకు ముందు నార్మల్ షో కి ఏదైతే టికెట్ ప్రయిజ్ ఉందో అంతే తీసుకుంటున్నారు. అంటే దాదాపు 100 - 200 మధ్యలో ఉంటుందన్నమాట. ఒక రోజు ముందు చూడడం అనే మహార్భాగ్యమే కాకుండా తక్కువ డబ్బుకి సినిమా చూసే అవకాశం రావడం సినీ ప్రేమికులకు ఒక రకంగా ఇది గొప్ప బహుమతి అని చెప్పొచ్చు. ఏషియన్ వల్లే కాకుండా వేరే థియేటర్ వాళ్ళు కూడా బాహుబలి 2 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. కానీ రేట్ వేరే థియేటర్లలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నైజాంలో రోజుకి 5 ఆటలు, ఆంధ్రాలో రోజుకి 6 ఆటలు పడనున్నాయి కాబట్టి బాహుబలి 2 ఇంతకు ముందున్న అన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



