సాహో టీజర్ లీక్
on Apr 26, 2017
లీకేజీల సమస్య తీవ్రతరం అవుతోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నా... సినిమా లీక్ అవ్వకుండా ఆపలేకపోతున్నారు. తాజాగా బాహుబలి 2కి సంబంధించిన కొన్ని సీన్లు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు సాహో టీజర్ కూడా లీకైంది. . ప్రభాస్ - సుజిత్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సాహో. బాహుబలి 2 తో పాటు సాహో టీజర్నిచూపించబోతున్నారు. ఈనెల 28 బయటకు రావాల్సిన టీజర్ ముందే వచ్చేసింది. ఈ టీజర్లో డైలాగ్ మాత్రం అల్టిమేట్ అనాలి.
రక్తం మరకలతో ఉన్న ప్రభాస్‌ని చూసి - ``ఆ రక్తం చూస్తే అర్థమవుతోందిరా.. వాడ్ని చచ్చేంతలా కొట్టారని`` అంటూ ప్రభాస్‌ని ఉద్దేశించి విలన్ ఓ డైలాగ్ చెబుతాడు. ``అది వాడి రక్తం కాదు.. మన మాళ్లది`` అని విలన్ గ్యాంగ్‌లో మరొకరి డైలాగ్ వినిపించింది. ``ఇట్స్ యువర్ టైమ్`` అనే ప్రభాస్ డైలాగ్‌తో ఈ టీజర్ ని యమ స్టైలీష్‌గా కట్ చేశాడు సుజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ అద్భుతంగా ఉంది. ప్రభాస్ లుక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా కనిపిస్తున్నాయి. బాహుబలి 2 సెన్సార్ దుబాయ్‌లో జరిగినప్పుడు అక్కడెవరో సినిమాని సెల్ఫోన్లో చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్లపై బాహుబలి టీమ్ ఎలాంటి యాక్షన్ తీసుకొంటుందో చూడాలి.