`శివాజీ`గా రజినీకాంత్ మెస్మరైజ్ చేసి నేటికి 15 ఏళ్ళు!
on Jun 15, 2022

సూపర్ స్టార్ రజినీకాంత్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా `శివాజీ - ది బాస్`. శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రజినీకాంత్ కి జంటగా శ్రియ కనువిందు చేయగా నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. సుమన్ విలన్ గా ఎంటర్టైన్ చేసిన ఈ మూవీలో వివేక్, రఘువరన్, మణివణ్ణన్, వడివుక్కరసి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. కేవీ ఆనంద్ ఛాయాగ్రాహణం ఈ చిత్రానికి ఓ ప్రధాన బలంగా నిలిచింది.
స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతసారథ్యంలో తెరకెక్కిన పాటల్లో ``వాజీ వాజీ``, ``సహానా శ్వాసే వీచేనో`` హైలైట్ గా నిలవగా ``స్టైల్``, ``బల్లేఇలక్క``, ``అదరనీ`` కూడా రంజింపజేశాయి. `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్` విభాగంలో `జాతీయ పురస్కారం` అందుకున్న `శివాజీ`.. `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుంది. ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్. గుహన్, ఎం.శరవణన్ నిర్మించిన `శివాజీ`.. 2007 జూన్ 15న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. కాగా, నేటితో ఈ సంచలన చిత్రం 15 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



