తెలంగాణలో రూ. 20 కోట్ల (షేర్)ను క్రాస్ చేసిన 'అఖండ'!
on Jan 2, 2022

నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయగా, బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన 'అఖండ' జాతర బాక్సాఫీస్ దగ్గర 5వ వారం కూడా కంటిన్యూ అవుతోంది. 30వ రోజు కంటే 31వ రోజు మరింతగా కలెక్షన్లు రావడం.. అదీ నాలుగు రెట్లకు పైగా రావడం విశేషం. ఈ క్రమంలో ఒక్క తెలంగాణలోనే రూ. 20 కోట్ల షేర్ మార్కును 'అఖండ' దాటేసింది. బాలయ్య సినిమా తెలంగాణలో ఈ ఫీట్ చేయడం ఇదే ప్రథమం. నిన్న 31వ రోజు తెలంగాణలో రూ. 19 లక్షలు వసూలు చేయడంతో ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ 'అఖండ' వసూలు చేసిన మొత్తం షేర్ రూ. 20.12 కోట్లకు చేరింది.
Also read: "షణ్ముఖ్, నేను విడిపోతున్నాం".. దీప్తి సంచలనం! కారణం ఆమేనా?
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం రూ. 10 లక్షల షేర్ మాత్రమే రాబట్టిన మూవీ శనివారం రూ. 46 లక్షల దాకా షేర్ రాబట్టడం అనూహ్యమనే చెప్పాలి. ఆంధ్రలో రూ. 13 లక్షలు, రాయలసీమలో రూ. 14 లక్షలను 'అఖండ' వసూలు చేసింది. వెరసి 31 రోజులకు తెలుగునాట ఈ మూవీ వసూళ్లు రూ. 60.60 కోట్లకు చేరుకున్నాయి. వరల్డ్ వైడ్‌గా చూస్తే 71.30 కోట్ల షేర్‌ను 'అఖండ' రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
Also read: బర్త్‌డే స్పెషల్: విక్టరీ వెంకటేశ్ టాప్ 10 రీమేక్స్
'అఖండ' ప్రి బిజినెస్ విలువ రూ. 53 కోట్లు. అంటే ఇప్పటివరకూ రూ. 18 కోట్లకు పైగా లాభాన్ని బయ్యర్లు రుచిచూశారు. బాలయ్య ఊపు చూస్తుంటే సంక్రాంతి వరకూ మంచి కలెక్షన్లు రాబట్టేటట్లు కనిపిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



