'NBK 108'లో విలన్ గా బాలీవుడ్ యాక్టర్!
on Nov 16, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' చేస్తున్నాడు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన కెరీర్ లో 108వ సినిమా చేయనున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్ఙున్ రాంపాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 'NBK 108'లో విలన్ గా అర్ఙున్ రాంపాల్ ని తీసుకున్నట్టు టాక్. బాలయ్య సినిమాలలో విలన్ పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. బాలయ్య ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రకు అర్ఙున్ రాంపాల్ సరిగ్గా సరిపోతాడన్న ఉద్దేశంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ముఖ్య పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



