కృష్ణను కడసారి చూసేందుకు కదిలిన జనసంద్రం
on Nov 16, 2022

సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసం నుంచి పద్మాలయా స్టూడియోస్ కు ఆయన పార్థివదేహాన్ని తరలించారు. ఆయనను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు జనాలు భారీగా క్యూ కట్టారు.
మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా కాసేపటి క్రితం వారి తాతగారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఫిలింనగర్ మహాప్రస్థానంలో మూడు గంటలకు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



