ఇంచు కూడా భయం లేదు.. ఈ క్రిస్మస్ మనదే!
on Dec 15, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీ డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాయల్ ఈవెంట్ పేరుతో వరంగల్ లో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలోనే మూవీ ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమా రిజల్ట్ గురించి కొంచెం కూడా భయం లేదని, ఈ క్రిస్మస్ కి హిట్ కొడుతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Also read: 'శ్యామ్ సింగరాయ్'తో నాని ప్రభంజనం.. శాటిలైట్ రైట్స్ కి అన్ని కోట్లా!
నాని మాట్లాడుతూ.. "రెండేళ్ల తర్వాత థియేటర్లోకి వస్తున్నా.. ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు. పెద్ద సినిమాలకి దగ్గరలో మా సినిమా వస్తున్నా మాకు భయం లేదు. ఎందుకంటే ఈ కథపై మాకున్న నమ్మకం అలాంటిది. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ ను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. ఈ క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమా కోసం రాహుల్ చాలా కష్టపడ్డాడు. టాప్ డైరెక్టర్ కాగల సత్తా రాహుల్ లో ఉంది. సాయిపల్లవి డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను. ఆమె డ్యాన్స్‌తో ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి తన పాత్రపై పూర్తి ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా చేసింది. తనకి మంచి భవిష్యత్తు ఉంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి చివరి పాటలతో 'శ్యామ్ సింగరాయ్' చిత్రం ఇంకా స్పెషల్‌గా మారింది. ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయి" అన్నారు.
Also read: 'శ్యామ్' అండ్ 'శ్యామ్'.. సేమ్ టు సేమ్!
తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. డ్యూయల్ రోల్ తో నాని అదరగొట్టాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



