బాలకృష్ణతో సినిమా చేస్తా: అనిల్ రావిపూడి
on Jan 8, 2020

కథ లేకుండా తానేప్పుడూ సినిమాలు చేయలేదని అంటున్నారు అనిల్ రావిపూడి. కథ లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడరని చెప్పారు. కథలు లేకుండా ఫార్ములాలను అనుసరించి సినిమాలు చేస్తాడని తనపై వచ్చే విమర్శలకు అనిల్‌రావిపూడి సమాధానమిస్తూ తాను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ హీరోల కెరీర్‌లలో బెస్ట్‌గా నిలిచాయని అన్నారు. కథలు లేకపోతే తన సినిమాలు 80 కోట్లకుపైగా ఎందుకు వసూళ్లు చేస్తాయని ఘాటుగా బదులిచ్చారు. మనం చేసే పని వందలో కేవలం డెబ్బై మందికే నచ్చుతుందని మిగతా ముప్పై మంది ఏం చేసినా తిడతారు. అలాంటి వారి మాటల్ని తాను పట్టించుకోననని చెప్పారు. ప్రతి దర్శకుడికి ఓ సెటప్ జోనర్ ఉంటుంది. వారిని టార్గెట్ పెట్టుకొనే సినిమాలు చేస్తామని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలనే ఆలోచనలు లేవని..వచ్చిన అవకాశాల్ని అనుసరించి చిన్న సినిమాలు చేయడానికి తాను సిద్ధమేనని అనిల్‌రావిపూడి అన్నారు. ఎఫ్-2కు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నానని, చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే తనకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరని, మెగాస్టార్‌తో పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణతో ఇదివరకు ఓ సినిమా చేయాల్సిందని కానీ అనివార్య కారణాల వల్ల డిలే అయ్యిందని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



