రవితేజ వద్దనుకున్న 'మహాసముద్రం'లో శర్వానంద్!
on Jan 8, 2020
.jpg)
'ఆర్ఎక్స్ 100' మూవీతో పరిచయమై, తొలి సినిమాతోటే సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి త్వరలో తన రెండో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. 'మహాసముద్రం' అనే టైటిల్‌తో రూపొందే ఈ మూవీలో హీరోగా శర్వానంద్ నటించడం ఖాయమైంది. ఇదివరకు ఈ రోల్‌ను నాగచైతన్య లేదా రవితేజ చేస్తాడనే ప్రచారం బాగా జరిగింది. ఆ ఇద్దరితోనూ అజయ్ సంప్రదింపులు జరిపాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. పైగా సెప్టెంబర్ 2న అతను చేసిన 'చీప్ స్టార్' ట్వీట్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది కూడా. రవితేజను ఉద్దేశించే అతను ఆ కామెంట్ చేశాడంటూ ప్రచారం జరిగింది.
అది గతం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి శర్వానంద్ వచ్చాడు. ప్రస్తుతం శర్వా '96' రీమేక్ 'జాను', 'శ్రీకారం' సినిమాలు చేస్తున్నాడు. 'జాను' త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. 'మహాసముద్రం' మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఇందులో నాయికగా సమంత పేరు వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే శర్వా, సమంత కలిసి 'జాను' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన సినిమాలో హీరోయిన్ రోల్‌కు సమంత అయితే న్యాయం చేస్తుందని భావించిన అజయ్, ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ వినిపించాడనీ, ఆమెకు స్క్రిప్ట్, హీరోయిన్ క్యారెక్టర్ నచ్చాయనీ అంటున్నారు. అయితే ఆమె ఈ మూవీలో నటించే విషయం ధ్రువపడలేదు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



