‘పుష్ప2’లో స్పైసీగా రంగమ్మత్త!
on Dec 29, 2022

అప్పటివరకు టీవీ యాంకర్ గా, హోస్ట్ గా, న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ తన కెరీర్ ప్రారంభంలో మాత్రం పలు చిన్న చిన్న చిత్రాలలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు సైతం పోషించింది. కానీ ఈమెకు రామ్ చరణ్ తో నటించిన రంగస్థలం మూవీ పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. విషయానికి వస్తే రామ్ చరణ్ ని తొలిసారిగా సుకుమార్ రంగస్థలం మూవీ లో విభిన్న పాత్రలో చూపించారు. చిట్టి బాబుగా వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ పాత్రను సుకుమార్ డిజైన్ చేశారు. ఇక రామలక్ష్మి గా సమంత పక్కా పల్లెటూరి యువతిగా కనిపించి మెప్పించింది.
వీరిద్దరితో పాటు ఈ చిత్రంతో భారీగా క్రేజ్ తెచ్చుకున్నది అనసూయ. ఈమె కెరీర్ ని ఈ సినిమా కీలక మలుపు తిప్పింది. ఈ మూవీలో ఆమె పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. మొగుడు చనిపోయిన కూడా అతను ఇంకా దుబాయ్ లో ఉన్నాడంటూ కాలం వెలదీసే గడసరి రంగమ్మత్తగా అనసూయ నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దాంతో ఈ క్యారెక్టర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆ తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చాయి. అటు వెండితెరపైనే కాక ఇటు వెబ్ సిరీస్ లతో కూడా బిజీగా మారి బుల్లితెరకు టాటా చెప్పేసింది. అయితే రంగమ్మత్త తర్వాత అనసూయను సుకుమార్ పుష్ప2లో మరింత విభిన్నంగా చూపించనున్నారట. సుకుమార్ మరోసారి ఆమెకు పుష్ఫ1లో నెగటివ్ షేడ్స్ ఉన్న దాక్షాయిని క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా అంతా కనిపించిన కూడా ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎండింగ్‌లో సునీల్ ని బ్లేడుతో కోసేసే సీన్ తప్ప ఇందులో ఆమె కు గుర్తుండిపోయే సీన్స్ అంటూ ఏమీ లేవు. కానీ పుష్పా2లో మాత్రం అనసూయతో సుక్కు మరోసారి మెరుపులు మెర్పించబోతున్నారట. పుష్ప2లో అనసూయ పాత్ర నిడివి చాలా ఎక్కువ అని, ఆమెపై ఊర మాస్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు.
ఆ విధంగా సుకుమార్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాడని అంతేకాక ఇందులో ఆమె చాలా స్పైసీగా కనిపిస్తుందని అంటున్నారు. ఫహద్ ఫాజిల్ తో కలిసి అనసూయ పుష్పరాజు పై కుట్ర చేయనుందా... లేక సోలోగానే ప్రతీకారానికి ప్లాన్ చేస్తుందా? అనేది సినిమా విడుదలైతే గాని తెలియదు. ఇక ఈ చిత్రం ఇటీవల ఐదు రోజులపాటు షూటింగ్ జరుపుకొని గ్యాప్ తీసుకుంది. తదుపరి అల్లు అర్జున్ పై కీలక ఘట్టాల చిత్రీకరణతో తాజా షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



