నేను థ్యాంక్యూ బ్రదర్ అంటే అందరూ ఫీలవుతారు!
on Nov 11, 2022

అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరు! 'జబర్దస్త్'లో ఒక వెలుగు వెలిగింది. వెండితెరను కూడా పలకరించింది. ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. ఐతే ఇప్పుడు ఈమె.. చీఫ్ గెస్ట్ గా 'మాయా పేటిక అనే సినిమా గ్లింప్స్ రిలీజ్ వేడుకలో పాల్గొంది. ఈ రిలీజ్ ఫంక్షన్ లో అనసూయ మాట్లాడుతూ.. "నేను థాంక్యూ బ్రదర్ అంటే అందరూ ఫీలవుతారు. అందునే నేను చెప్పను. ఇక నాకు జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ ఓ కుటుంబం లాంటింది. మీ అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది." అని చెప్పింది.
తనకు ఈ సినిమాలో చాన్స్ ఎందుకు ఇవ్వలేదో డైరెక్టర్ కారణం చెప్పారు కాబట్టి ఆయన బతికిపోయారంటూ హాస్యమాడింది. "ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. నేను ఈ మూవీలో లేకపోయినా ఈ మూవీ గురించి చెప్తున్నాను అంటే ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. 'మాయాపేటిక మూవీ టీమ్ కి శుభాకాంక్షలు" అంది అనసూయ.
అనసూయ లీడ్ రోల్ చేసిన 'థ్యాంక్యూ బ్రదర్' మూవీని తీసిన జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇప్పుడు ఈ 'మాయా పేటిక మూవీని నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ అన్‌బాక్సింగ్ గ్లింప్స్ కు అనసూయను గెస్టుగా పిలిచారు మేకర్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



