ఇండస్ట్రీలోకి కొత్త రక్తం...హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు ఆకాష్!
on Nov 11, 2022
.webp)
సింగర్ సునీత ఈమెకు పరిచయం అక్కర్లేదు.. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరే ఈమెది. "రాయబారమై" అని వన్ మినిట్ మ్యూజిక్ తో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. అలాంటి సునీత ఇప్పుడు తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సునీతకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఐతే కూతురు శ్రీయాని ఇండస్ట్రీలో సింగర్ గా పరిచయం చేసింది. ఇక ఇప్పుడు కొడుకు ఆకాష్ వంతు వచ్చింది. చూడడానికి మంచి హైట్, మంచి కలర్ ఉండడంతో పాటు హీరో అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇటీవల ఆకాష్ బర్త్ డే సందర్భంగా సునీత కొడుకుని హీరోగా రాబోయే రోజుల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి సునీతకు నచ్చిన కొన్ని ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రాబోయే రోజుల్లో హీరోగా చూడాలి అని ఆశపడుతున్నాను అని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
ఇక ఆకాష్ కటౌట్ చూస్తే నిజంగానే హీరోనా అనిపించేలా ఉన్నాడు. ఇక ఈ పోస్ట్ కి నెటిజన్స్ కూడా "చూడడానికి రణ్బీర్ లా ఉన్నాడు, బాలీవుడ్ కటౌట్" అని బెస్ట్ విషెస్ చెప్తున్నారు నెటిజన్స్. మరి ఆకాష్ ఏ డైరెక్టర్ చేతిలో పడి ఎలా మెరుస్తాడో రాబోయే రోజుల్లో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



