రవితేజతో మరోసారి వేణు!
on Feb 1, 2022

`స్వయంవరం`, `చిరునవ్వుతో`, `హనుమాన్ జంక్షన్`, `పెళ్ళాం ఊరెళితే`, `కళ్యాణ రాముడు`, `ఖుషీ ఖుషీగా`, `శ్రీకృష్ణ 2006`, `యమగోల మళ్ళీ మొదలైంది`, `గోపి గోపిక గోదావరి` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు వేణు తొట్టెంపూడి. ఆమధ్య సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ నటించిన `చింతకాయల రవి`లోనూ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన `దమ్ము`లోనూ సహాయక పాత్రల్లో కనిపించి అలరించారు ఈ టాలెంటెడ్ యాక్టర్.
ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళ తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వేణు. కథానాయకుడిగా కాకుండా, సహాయక పాత్రలోనే ఈ సారి కూడా కనిపించనున్నారు. ఆ చిత్రమే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ`. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వేసవిలో జనం ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రంతో పాటు మరో సినిమాలోనూ రవితేజ, వేణు కలిసి నటించబోతున్నారట. ఆ చిత్రమే.. `ధమాకా`. త్రినాథరావ్ నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో దర్శనమివ్వబోతున్నారట వేణు. త్వరలోనే `ధమాకా`లో వేణు ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. రవితేజ కాంబినేషన్ లో వేణు చేస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తనకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



